సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కోరిన టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 11 ( విజయ క్రాంతి ): ఈరోజు హైదరాబాద్ లోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయంలో(TNGO Central Association Office) రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని లో ఆధ్వర్యంలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో టీఎన్జీవో జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయుటకు ప్రభుత్వ హామీ మేరకు అధ్యయన కమిటీ వేయుట, పిఆర్సి 2023 రిపోర్టు తెప్పించి వెంటనే అమలు అయ్యేలా చూడాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం మరింత పటిష్టంగా అమలు అయ్యేలా చూడటం.
పెండింగ్ డిఏ ల విడుదల, పెండింగ్ బిల్లుల విడుదల, వివిధ శాఖలలో పదోన్నతులు, జిల్లాలోని ఉద్యోగుల ఇతర సమస్యల గురించి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు వివరించి, ప్రభుత్వం ద్వారా త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని కోరినారు.
సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం ప్రకటించే కార్యాచరణ అమలు చేయుటకు జగిత్యాల జిల్లా ఉద్యోగుల పక్షాన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం తో మాట్లాడి ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా టిఎన్జీఓ సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని అన్నారు.
ఇట్టి సమావేశంలో కేంద్ర సంఘం సహధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉమాదేవి, కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు రాగి శ్రీనివాస్, హార్మిందర్ సింగ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.