అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి
గుమ్మడిదల నవంబర్ 11: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా గుమ్మడిదల మండలం నల్లవల్లి సర్పంచ్ కొరివి రాణిసురేష్(Sarpanch Rani Suresh) అన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని, అధికారులు నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రోళ్ల పోచయ్య,వార్డుసభ్యులు ఎర్రోళ్ల రజని జితేందర్, కుమ్మరి ఆంజనేయులు, సాదుపల్లి మంజుల అశోకగౌడ్, బనుక యాదమ్మ మల్లేష్, జిపిఓ శ్రీశైలం, మాజి ఎంపీటీసీ బండారి కిష్టాగౌడ్, మాజి వార్డు సభ్యులు చాకలి ఆశయ్య, తలారి బాలయ్య, వెన్నెల్లి రామగౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.