పెన్షన్ విషయంలో ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగొద్దు

17-11-2026 | 06:21pm

జనగామ, నవంబర్ 17 (విజయక్రాంతి): జనగామ మున్సిపల్ కార్యాలయంలో(Jangaon Municipal Office) మంగళవారం నూతన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Dr. Palla Rajeshwar Reddy) ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి 5 రకాల పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఒకే కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తోందని మరో అర్హుడి పెన్షన్ నిలిపివేయొద్దు జీవనోపాధి కోసం వాడే ట్రాక్టర్, డీసీఎం వాహనాల పేరుతో పెన్షన్లు తొలగించొద్దు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చిందని వృద్ధులు,

దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేయొద్దు పెండింగ్ లో ఉన్న వృద్ధాప్య, బీడీ, నేత కార్మికుల పెన్షన్లు మంజూరు చేయాలి ఎన్నికల హామీ మేరకు పెన్షన్ రూ.4 వేలకు పెంచాలి అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బుష పర్వతాలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు