విద్యార్థినికి న్యాయం చేయాలి..
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బెజ్జంకి,విజయక్రాంతి: సిద్దిపేట ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలో(Government Veterinary College) మహిళా విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ బెజ్జంకి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కార్యదర్శి బోష ప్రజ్వేశ్ మాట్లాడుతూ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రేమ్, సాయి శివ, చరణ్ తేజ్, హర్షిత్, వరుణ్, ఆసిఫ్, ఓంకార్, సుశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.