జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మేడారం అపర్ణ

17-11-2026 | 05:58pm

నిర్మల్ నవంబర్ 17 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోమవార్పేట్ కాలనీ(Somwarpet Colony) చెందిన బీసీ బిడ్డ సీనియర్ కాంగ్రెస్ నేత మేడారం అపర్ణ ప్రదీప్ జిల్లా కాంగ్రెస్ మహిళా(District Congress Women) అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ   చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా కౌన్సిలర్ గా బీసీ మహిళా నాయకురాలిగా ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా జిల్లా బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో మహిళా విభాగాన్ని ఐక్యత ముందుకు నడిపి పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. తనకు బాధ్యతలను అప్పగించేందుకు సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు వెడుమ బొజ్జ పటేల పార్టీ ఇంచార్జ్ శ్రీహరి రావు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి  సీనియర్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.,

మరిన్ని వార్తలు