పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
బెజ్జంకి,విజయక్రాంతి: పేదల సంక్షేమం(Welfare of the poor), ఆత్మగౌరవం, ఆర్థిక భరోసానే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం (Indiramma’s People’s Government) పనిచేస్తోందని బెజ్జంకి రెండో వార్డు సభ్యురాలు బండి నవిత వేణు యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయడం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.