సాదర్ ఉత్సవ కమిటీ
- సాధర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
- నూతన మండల అధ్యక్షులు సాయికిరణ్ యాదవ్
సుల్తానాబాద్, నవంబర్ 17(విజయ క్రాంతి ): సాధర్ ఉత్సవాలను(Sadhar Utsavalu) ఘనంగా నిర్వహిస్తామని నూతన మండల అధ్యక్షునిగా ఎన్నికైన,సామాజిక సేవకులు ఆరవ వార్డు కౌన్సిలర్ బాకం సాయికిరణ్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆరవ వార్డు కౌన్సిలర్ సాయికిరణ్ యాదవ్ కు మరో పదవి వరించింది.
సుల్తానాబాద్ మండల సాదర్ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గ ఎంపికలో 6వ వార్డు కౌన్సిలర్ బాకం సాయి కిరణ్ యాదవ్ ను మండల అధ్యక్షుడిగా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఉపాధ్యక్షుడుగా ఓజ్జ సతీష్ యాదవ్ , క్యాషియర్ గా మాజీ కౌన్సిలర్ కూ కట్ల గోపి యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా యాదవ సంఘం పెద్దలు, సభ్యులు నూతన కార్యవర్గంపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు క్యాషియర్లకు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో సాదర్ ఉత్సవ కమిటీ ఐక్యతతో, సంప్రదాయాలను కాపాడుతూ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పలువురు కోరారు.
ఈ సందర్భంగా నూతనంగా సాధర్ సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్, మాట్లాడుతూ తనపై నమ్మకంతో కుల పెద్దలంతా ఏకగ్రీవంగా మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించి,
ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాదర్ ఉత్సవాలను నూతన కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా సంస్కృతిసాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా నిర్వహిస్తామని భాకం సాయికిరణ్ యాదవ్ స్పష్టం చేశారు. కౌన్సిలర్ బాకం సాయికిరణ్ యాదవ్ ఎన్నిక పట్ల పలువురు, సంఘం పెద్దలు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.