వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

17-11-2026 | 06:00pm

రుద్రంగి నవంబర్ 17(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సొసైటీ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని(paddy procurement center) సింగిల్ విండో చైర్మన్ ఏగోళం శ్రీనివాస్,మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి,ఆత్మ కమిటి చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి,గ్రామ సర్పంచ్ గండి నారాయణ,ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు,రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి,సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపతి ప్రభుత్వం అని అందుకే రైతు రుణమాఫీ,రైతు భరోసా, రైతు భీమా అందిస్తుందని అన్నారు.మూడు సంవత్సరలుగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని అన్నారు.

ఎల్ నీనో ప్రభావన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు అరుతడి పంటలు వేయాలని సూచించారు....ఈ కార్యక్రమంలో,మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య,పొద్దుపొడుపు లింగారెడ్డి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ప్యాక్స్ డైరెక్టర్లు,ధర్నా మల్లేశం,తర్రే మనోహర్,సనుగుల గంగాధర్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య,ఎస్సిసెల్ శీలం మీనయ్య,పుట్కపు మహిపాల్,గంధం మనోజ్,నాయకులు గడ్డం శ్రీనివాస్,కొమిరె శంకర్, పల్లి గంగాధర్,తర్రే లింగం, కేసిరెడ్డి నర్సారెడ్డి, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు