విద్యరంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంటా!
టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి.. అనుమోలు కోటేశ్వరరావు..
టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన అనుమోలుకోటేశ్వరరావుకు ఎర్రుపాలెం మండల కమిటీ అభినందనలు..
ఎర్రుపాలెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభలు ఈనెల 15, 16 తేదీల్లో ముదిగొండలో జరిగినవి. ఈ మహాసభలో టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనుమోలు కోటేశ్వరరావు(Anumolu Koteswara Rao)కు జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన కంచర్ల శ్రీనివాసరావు, నండ్రు వెంకటేశ్వరరావు, రావిరాల భరత్ కుమార్, ఎఫ్ డబ్ల్యూ ఎస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన నీలం సైదారావుకు టీఎస్ యుటిఎఫ్ ఎర్రుపాలెం మండల కమిటీ అభినందనలు తెలియజేసింది.
గత 25 సంవత్సరాలుగా ఎర్రుపాలెం, మండల టీఎస్ యుటిఎఫ్ సంఘ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, ఉపాధ్యాయులను ఐక్యపరిచి సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న అనుమోలు కోటేశ్వరరావు సేవలు అభినందనీయమని మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గతంలో ఆయన జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు.
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ, పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం సంఘం చేస్తున్న పోరాటాల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు టీఎస్ యుటిఎఫ్ చేపట్టే ఉద్యమాలు, కార్యక్రమాల్లో ముందుండి పనిచేయాలని ఆకాంక్షించారు.
జిల్లా కమిటీకి ఎన్నికైన సభ్యులు కూడా మండలంలో విద్య రంగానికి కృషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ సంఘం బలోపేతానికి కృషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ ఎర్రుపాలెం కమిటీ సభ్యులు టి. రత్నమ్మ, ఎన్. సాంబశివరెడ్డి, ఎన్. పుల్లారావు, షేక్ ఖాజా, సుధాకర్, సిహెచ్. శివపార్వతి, టి. వెంకట కృష్ణ, కె సందీప్, జి రామకృష్ణ, కె. జీవన్ బాబు, కె సత్యనారాయణ, ఎం. సతీష్, షేక్. యాకుబ్, డి. రమేష్, ఎన్. రాంప్రసాద్, ఎస్. వెంకమ్మ, ఎం. రాజేశ్వరి, టి. ధనలక్ష్మి, కె. కృష్ణవేణి, పి .రాంబాబు,నవీన్ కోరారు.