ప్రతిభావంతుడికి లక్ష రూపాయల చెక్కు అందజేత
17-11-2026 | 06:18pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్(Shriram Life Insurance) వారు నిర్వహిస్తున్న మిషన్ టెన్త్ క్లాస్ (చదువుకో తెలంగాణ) లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం పెదవంగర మండలం చిట్యాల గ్రామానికి చెందిన రాపోలు రవికీర్తన్ ప్రథమ బహుమతి సాధించాడు.
ఇందుకు గాను ఒక లక్ష రూపాయల చెక్ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి చేతుల మీదుగా రవికీర్తన్ తండ్రి లక్ష్మీ నారాయణ కు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం చదువుకో తెలంగాణ 2026-27 పోస్టర్ ను ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో తొర్రూరు బ్రాంచ్ మేనేజర్ రాజబోయిన సాయికుమార్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కల్లూరి సతీశ్ ,ఎస్ఓ బి. శ్రీనివాస్ పాల్గొన్నారు.