స్పందించారు..బస్సు ప్రారంభించారు
బెజ్జూర్ నవంబర్ 17 ( విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని గిరిజన గ్రామాలకు(tribal villages) "పల్లెకురాని బస్సు " అనే కథనం విజయక్రాంతి దినపత్రికలో మంగళవారం వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఆసిఫాబాద్ డిపో మేనేజర్(Asifabad Depot Manager) రాజశేఖర్ స్పందించి సోమిని గూడెం మీదుగా అహరి కి వెళ్లే కొమురం భీం ఆసిఫాబాద్ డిపో ఆర్టీసీ బస్సు ను ప్రారంభించారు.
రోడ్డు బాగాలేక వారం రోజులే ఆర్టీసీ బస్సు నడిపి బందు చేసినట్లు తెలిపారు. రోడ్డు గుంతల మయంగా ప్రమాదకరంగా ఉండడంతో ప్రయాణికులు గుంతల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు బాగు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
విజయక్రాంతి దినపత్రిక లో వచ్చిన కథనానికి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ స్పందించి వెంటనే గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని తెలపడంతో మంగళవారం సోమిని, గూడెం మీదుగా అహిరికి బస్సు ప్రారంభమైంది.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బస్సు సౌకర్యం కల్పించినందుకు విజయ క్రాంతి దినపత్రిక యాజమాన్యానికి, ఆర్టీసీ డిపో మేనేజర్ కు గిరిజన గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.