కలెక్టరేట్‌ను సందర్శించిన విద్యార్థులు

12-11-2026 | 04:09pm

గణపురం, నవంబర్ 12 (విజయ క్రాంతి): గణపురం మండల లోని చెల్పూర్  చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు(Students of Chaitanya High School, Chelpur), ఉపాధ్యాయులు గురువారం జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఆర్వో బి. వసంతకుమారి, డీపీఆర్వో ఎస్. శ్రీనివాస్, సీపీఓ మార్త కిష్టయ్య, డీఈఓ లలితకుమారిని విద్యార్థులు కలిసి వారి విధుల గురించి తెలుసుకున్నారు. లైజన్ అధికారి సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశ్విని అంటోని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు