బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం
తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి కోర్టుకు నూతనంగా జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన, న్యాయమూర్తి మహమ్మద్ మునవార్ హుస్సేన్(Justice Muhammad Munawar Hussain) తుంగతుర్తి బార్ అసోసియేషన్(Tungaturthi Bar Association) ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞాన సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు నూతన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక స్వాగతం పలికారు.
అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ, న్యాయవాదుల సహకారంతో న్యాయస్థాన కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కృషి చేస్తామని ఆకాంక్షించారు. న్యాయవాదులు సైతం న్యాయవ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుతూ, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టి. హరి చరణ్, జాయింట్ సెక్రటరీ మల్లెపాక రవి, సీనియర్ న్యాయవాదులు జె. కుమారస్వామి, కె. వెంకటేశ్వర్లు, టి. సత్యనారాయణ, Sk వజీర్, బి.ప్రతాప్, వేణురాజ్ యాదవ్, జె. చంద్ర మౌళి, నాగరాజ్, రాజారాం, ఓర్సు రాజు ,సైదులు, శ్రీనివాస్ తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.