విద్యార్థుల్లో ప్రతిభకు పరీక్ష

12-11-2026 | 04:13pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): విద్యార్థుల్లో(Students) శాస్త్రీయ ఆలోచనా విధానం(Scientific way of thinking), విజ్ఞాన పరిజ్ఞానం(Knowledge and Understanding), పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ప్రధానోపాధ్యాయురాలు ఉమాబాల విడుదల చేశారు.

ఈ పోటీ పరీక్షలో పాఠశాలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పరీక్షలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ వడ్లు రాజేష్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు