గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

12-11-2026 | 04:07pm

ఏటూరునాగారం / కన్నాయిగూడెం, నవంబర్ 12(విజయక్రాంతి): ఏటూరునాగారం గ్రామంలో(Eturunagaram Village) నీటి సంరక్షణ (Water Conservation) మరియు పశువుల సంక్షేమమే(Animal welfare) లక్ష్యంగా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను సర్పంచ్  కాకులమర్రి శ్రీలత గురువారం రోజున లాంఛనంగా ప్రారంభించారు.సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయలు కొట్టి ఆమె ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

ఇంకుడు గుంతల నిర్మాణం 

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే ఉద్దేశంతో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణతో పాటు 10వ వార్డు  12వ వార్డు మరియు 14వ వార్డులలో నూతన ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు.

గోశాల అభివృద్ధి

గోశాలలోని గోవులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా నూతన నీటి తొట్టి నిర్మాణం, అలాగే వాటికి ఎండ, వానల నుండి రక్షణ కల్పించేందుకు షెడ్డు నిర్మాణ పనులను చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ కాకులమర్రి శ్రీలత  మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నీటి పొదుపు పాటిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి జనార్ధన్, ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, కాకులమర్రి అరుణమ్మ, ప్రమీల,వార్డు సభ్యులు, కొండాయి చిన్ని, కాళ్ల రామకృష్ణ, గంప కిరణ్ ,పెద్ద బోయిన బాలకృష్ణ, గండేపల్లి నాగరాజు, మాదరి మధు, ఏం పెళ్లి రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ సాంబశివరావు, బాస శరత్,రాంబాబు, లక్ష్మీ,సతీష్, పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు