ప్లాస్టిక్ తిని... లేగ దూడల అవస్థలు

12-11-2026 | 03:58pm

కాపాడాలని స్థానికుల విన్నపం

ఖానాపూర్ (విజయక్రాంతి): రొడ్డు పై వదిలిపెట్టిన ఆవులు లేగ దూడలు ప్లాస్టిక్ పదార్థాలను(Plastic materials) తిని మరణావస్థకు చేరుకుంటున్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీ లో(Khanapur Municipality) ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద లేగ దూడ మరణావస్థలో కొట్టుమిట్టాడుతుంది. స్థానికులు గమనించి పశు వైద్యశాలకు సమాచారం అందించారు.

కాగా యజమానులు పశువులను రోడ్లపై వదిలిపెట్టడంతో అవి ప్లాస్టిక్ పదార్థాలను తిని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాయని అలా కాకుండా యజమానులు లేగ దూడలను, ఆవులను గోశాలకు అప్పగించి వాటి ప్రాణాలను కాపాడాలని అంటున్నారు. స్థానిక కౌన్సిలర్ నిమ్మల రమేష్ వైద్య పశు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చి లేగ దూడకు వైద్యం అందించారు.

మరిన్ని వార్తలు