ఇరుకు రోడ్లతో అవస్థలు.. మురికి కాలువలోపడ్డ కారు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) ప్రధాన రహదారి ఇరుకుగా, దారుణంగా మారడంతో వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. దశాబ్దాలుగా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) రహదారి విస్తీర్ణం చేయక ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదివరకే అనేకసార్లు ఆక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోవటమే కాకుండా చాలామంది గాయాలపాలై ఆసుపత్రి పాలైనారు. తాజాగా గురువారం పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఒక కారు మూల మలుపు తిరుగుతూ పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. దీంతో ఆ కారును బయటకు తీసేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు.
కాగా రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు ఎదురై వాహనదారులు ప్రయాణికులు పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా స్థానిక నాయకులు, మున్సిపాలిటీ అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పూర్తి చేసి స్థానిక ప్రజల సమస్య తీర్చాలని పలువురు అక్కడ చర్చించుకోవడం గమనార్హం. వేచి చూడాలి నాయకులు అధికారుల స్పందన ఎలా ఉంటుందో.