మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ
12-11-2026 | 03:46pm
బోథ్. నవంబర్ 12( విజయక్రాంతి) మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో(Karathwada Gram Panchayat) మహిళా సమాఖ్య భవన(Women's Federation Building) నిర్మాణానికి గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు భవనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏ ఈ హరీష్ కుమార్ గ్రామ కార్యదర్శి సమ్రిన్ సుల్తానా, ఐకెపి సిబ్బంది సి సి భాస్కర్, గంగాధర్, డోంగరి రమేష్, చిన్నయ్య, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.