వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కరాటే డెమో కార్యక్రమంలో జయశంకర్ జిల్లా విద్యార్థులు

15-11-2026 | 02:20pm

7 నిమిషాల 50 సెకండ్లలో 200 కిక్స్ కొట్టి రికార్డు నమోదు చేసిన షావులీన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు 

రికార్డు ప్రశంసా పత్రం అందజేసిన తెలంగాణా తొలి శాసనసభాపతి, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి

జిల్లా విద్యార్థులకు సిరికొండ ప్రత్యేక అభినందనలు

భూపాలపల్లి టౌన్, నవంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ కేఎంఆర్ ఫంక్షన్ హాలు గార్డెన్, ఇబ్రహీంపట్నంలో పయోనీర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ కరాటే డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా షావులీన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ(Shaolin Dragon Martial Arts Academy) విద్యార్థులు పాల్గోని 7 నిమిషాల 50 సెకండ్లలో 200 కిక్స్ కొట్టి ఇంటర్నేషనల్ వండర్ రికార్డు సృష్టించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనచారి చేతుల మీదుగా రికార్డు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రికార్డ్ సృష్టించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులను మాస్టర్లు మాదాసి శ్రీనివాస్ ( కరాటే ), గోసిక అశోక్ లను ముఖ్యఅతిధి మధుసూదనచారి, కార్యక్రమ నిర్వాహకులు రాజశేఖర్, నర్సింహాచారి ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు