తెలిసిన వారింట్లోనే చోరీ.. నిందితుడు అరెస్ట్
కల్లూరు, నవంబర్ 15 (విజయక్రాంతి): తెలిసిన వారి ఇంట్లోనే చోరీకి పాల్పడిన నిందితుడిని కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లూరు పట్టణ శివారులోని ఖాన్ ఖాన్ పేటలో జరిగిన ఈ చోరీ కేసును ఛేదించి నిందితుడి నుంచి సుమారు రూ.1.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాన్ ఖాన్ పేటకు చెందిన భరోతు నాగ వెంకటేశ్వర్లు అలియాస్ చంటి (40) అజ్మీరా నరసింహ ఇంటి కరెంట్ మీటర్ వెనుక ఉంచిన తాళం చెవిని (House Key) తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలను (Gold and Silver Jewellery) అపహరించాడు. వాటిలో కొన్నింటిని కల్లూరులోని ఓ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టి రూ.30 వేలు తీసుకున్నాడు.
మిగిలిన ఆభరణాలను ద్విచక్ర వాహనం ట్యాంక్ కవర్లో దాచుకుని తిరువూరుకు తరలిస్తుండగా ఎన్ఎస్పీ ఎక్స్‌రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో (Vehicle Checking) పోలీసులకు పట్టుబడ్డాడు.నిందితుడి నుంచి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, 230 గ్రాముల వెండి ఆభరణాలు, హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.చోరీ కేసును ఛేదించడంలో సహకరించిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సీఐ సర్వయ్య అభినందించారు.