గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతిరూపం భగవాన్ బిర్సా ముండా
బోథ్, నవంబర్ 15 (విజయక్రాంతి): భగవాన్ బిర్సా ముండా (Bhagwan Birsa Munda) 151వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. జనజాతీయ గౌరవ దివస్ (Janjatiya Gaurav Divas) పేరుతో వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆదివాసీల ఐక్యత (Tribal Unity) కోసం బిర్సా ముండా చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. గిరిజన సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడడంలో ఆయన పోరాటం ఎంతో గొప్పదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అణగారిన వర్గాల పాత్ర ఎంత కీలకమో బిర్సా ముండా జీవితం గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.
ఆయన ఆశయాలైన స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భూమి తండ్రిగా పిలుచుకుంటారని తెలిపారు. బ్రిటిష్ పాలకులు, జమీందారులను గడగడలాడించిన గొప్ప యోధుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సార్ మేడి భీమ్రావు, రాజ్ గోండు ఉద్యోగుల సంఘం నాయకుడు భూమన్న, ప్రధానోపాధ్యాయుడు ఆత్రం శంకర్, కరత్వాడ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వరరావు, అందరు సర్పంచ్ పెందుర్తి పృథ్విరాజ్, పిప్పలదరి సర్పంచ్ మిశ్రమ కృష్ణ, నాయకపోడు సంఘం నాయకులు రామల్లి భోజన్న, కురుమే రాజన్న, కనుక అమృతరావు, మహిళా సంఘం నాయకురాలు సుశీల, నైతం వనిత, పాట్నాపూర్ పటేల్ తొడసం నీలకంఠ, గోపాల్, మంగారపు మహేష్, చింతగూడ పటేల్ రమేష్తో పాటు వివిధ గ్రామాల పటేళ్లు పాల్గొన్నారు.