జెన్సీలో బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు
ఉట్నూర్, నవంబర్ 15 (విజయక్రాంతి): భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన ప్రజాయోధుడు, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమించిన మన్యం వీరుడు అమరజీవి భగవాన్ బిర్సా ముండా (Bhagwan Birsa Munda) 151వ జయంతి వేడుకలను ఉట్నూర్ ఏజెన్సీలో ఘనంగా నిర్వహించారు. ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు, మండల కేంద్రాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రగల్ వద్ద ప్రత్యేకంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ (Tribal Rights Protection), గిరిజనుల విముక్తి కోసం బిర్సా ముండా చేసిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ గిరిజన హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రగల్ జెండా చైర్మన్ మెస్రం నగ్నత్, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్కా బాపూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కా చిత్రు, జిల్లా ఉపాధ్యక్షుడు గెడం భరత్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనక గణేష్, కొట్నాక్ తిర్మన్ రావు, మరప కోసు కటోడా తదితరులు పాల్గొన్నారు.