ప్రభుత్వ ఆదేశాలు పాటించని పంచాయతీ అధికారులు
నాగిరెడ్డిపేట్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావం వల్ల నీటి సమస్య నీటి కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం మొర్రో అని మొత్తుకున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని పోచారం గ్రామం(Pocharam Villagers)లో త్రాగు నీరు వృధాగా మురికి పలు అవుతుంది. తాగునీరు మురికి పలు కావడంతో గ్రామపంచాయతీ అధికారులు,సిబ్బంది అటువైపు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
తాగునీరు వృధాగా మురికి కాలువలో కలవడంతో పలు సార్లు గ్రామస్తుడు జగన్ రెడ్డి పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా స్పందించడం లేదని ఆయన తెలిపారు.ఇ లా త్రాగునీరు వృధా చేయడం వల్ల రానున్న వేసవికాలంలో నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ పంచాయతీ అధికారులు సిబ్బంది పట్టించుకోవడంలేదని జగన్ రెడ్డి తెలిపారు. ముందస్తు జాగ్రత్త కోసం రానున్న వేసవి రోజుల్లో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు త్రాగునీరు మురికి కాలువల వెంబడి వృధా చేయకూడదని తక్షణమే నీటి వృధా అరికట్టాలని గ్రామస్తులు జగన్ రెడ్డి తెలిపారు.దీనిపై మండల అధికారులు స్పందించి మండలంలో త్రాగునీరు నీటి వృధా గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.