సంకష్ట హరగణపతి ఆలయ కమిటీ ఎన్నిక
అధ్యక్షునిగా రవీందర్ గౌడ్
కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో(Sankashtahara Ganapathi Temple) మొట్టమొదటిసారిగా ఆలయ కమిటీ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఆదివారం ఎన్నుకున్నారు. ఎలక్షన్ అధికారులు వేణుగోపాల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నిక లు నిర్వహించారు. ఈ ఎన్నికలలో హౌసింగ్ బోర్డు కాలనీ, లలిత నగర్, ద్వారకా నగర్,కౌండిన్య కాలానికి చెందిన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు ఉన్నారు.
అధ్యక్ష పదవికి పోటీలో బొంబోతుల రవీందర్ గౌడ్, సాయిరాము పోటీ చేయగా బొంబోతుల రవీందర్ గౌడ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. గెలుపొందిన బొంబోతుల రవీందర్ గౌడ్ ను కాలనీ కమిటీ అధ్యక్షులు చీటీ పాండురంగారావు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు సుతారి అంజయ్య, విశ్వం గుప్త, భవాని గ్రహమండలేశ్వర మహిళా సభ్యులు, గణేష్ సేవాదళ్ సభ్యులు, భారీ గజమాలతో ఆలయ ఆవరణలో సన్మానించారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బొంబోతుల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకముతో సంకష్టహర మహా గణపతి క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నాకు ఓటు వేసిన వారికి, వేయని వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు లాగా కాకుండా మీ తోటి ఒక్క సేవకుడిగా ఉండి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతానని బొంబోతుల రవీందర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.