వేలిమెలలో ఆఫీస్ ప్రారంభోత్సవం
సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న శాపురం నర్సింహారెడ్డి
ప్రత్యేక పూజలు నిర్వహించి ఆఫీస్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహారెడ్డి
పటాన్ చెరు, నవంబర్ 29 : వేలిమెల గ్రామంలోని(Velimela Village) ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ముత్తంగి డివిజన్–265 సీసీఎంసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహారెడ్డి(Senior Congress leader Shapuram Narsimha Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో(devotional) తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆఫీస్ నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ప్రారంభించిన కార్యాలయం విజయవంతంగా కొనసాగాలని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి కృప, ఆశీస్సులు నిర్వాహకులతో పాటు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.