అశ్విని ఆంజనేయులుకు సేవా రత్న పురస్కారం
హన్వాడ విజయక్రాంతి : మండల పరిధి లోని పెద్దర్పల్లికి(Peddarpalli) చెందిన అశ్వని ఆంజనేయులకు వివిధ సామాజిక రంగాలలో(Social sectors) అనాధ సేవలో విశేష సేవలు అందిస్తున్న కర్పూరి ఠాకూర్ సామాజిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జర్నలిస్టు అశ్విని ఆంజనేయులుకు ప్రతిష్టాత్మక విశిష్ట సేవా రత్న పురస్కారం(Seva Ratna Award) దక్కింది. ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ కార్తీకమాస వన సమారాధన వార్షికోత్సవ సందర్భంగా ధర్మపురి క్షేత్రం(Dharmapuri Shrine), దీప్తి నగర్ హైదరాబాద్ నగరంలో(Hyderabad City)-2026 అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన షేర్ లింగంపల్లి కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వర్తనపల్లి రామకృష్ణ చేతుల మీదుగా అశ్విని ఆంజనేయులు అవార్డును అందుకున్నారు. అనంతరం అశ్విని ఆంజనేయులు మాట్లాడుతూ తాను చేస్తున్న సేవలను గుర్తించి విశిష్ట ప్రతిభ సేవా రత్న అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి నిర్వాహకులు రావిపాటి నరసింహారావు, మేడూరి పీర్ల స్వామి, పెనుగొండ రత్న కుమార్, ఎడ్ల లీలా కృష్ణ, దుర్గాదేవి, సత్యవోలు రాంబాబు, భాను సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.