ఆనాటి ఉద్యమ ద్రోహులే నేటి కాంగ్రెస్ మంత్రులు

29-11-2026 | 09:55pm

బిఆర్ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి

హుజూర్ నగర్,నవంబర్ 29: నాటి ఉద్యమ ద్రోహులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress government) మంత్రులుగా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ(BRS Party) హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి(Onteddu Narasimha Reddy) అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా సెంటర్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని(Initiation Day program) నిర్వహించి మాట్లాడారు... కెసిఆర్(KCR) పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఏర్పాటయిం దన్నారు. నాడు కెసిఆర్(KCR) సచ్చుడు తెలంగాణ వచ్చుడో అంటూ నిర్ణయం తీసుకొని దీక్షకు దిగిన వెంటనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారని అన్నారు. 

నాడు తెలంగాణ వ్యతిరేకులే నేడు తెలంగాణ మంత్రులుగా ఉన్నారని విమర్శించారు.ఉద్యమ సమయంలో  తెలంగాణను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అగ్రగామిగా ఉందన్నారు.నేడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం హరిగోశపడుతుందన్నారు.

తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని,పంటలు ఎండి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో దగాపడ్డారని,నాడు ఉద్యమకారులపై గన్నెక్కు పెట్టిన రైఫిల్ రెడ్డి నేడు తెలంగాణ సీఎంగా ఉన్నాడన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ను చేసేందుకు పోరాడుతున్నారని అన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,బెల్లంకొండ అమర్ గౌడ్,దొడ్డ నరసింహారావు పచ్చిపాల ఉపేందర్,ములకలపల్లి రాంబాబు,అన్నెం  కొండారెడ్డి,భాస్కర్ రెడ్డి,రెక్కల శoబిరెడ్డి,సైదేశ్వరరావు అలీపాష, పొదిల ఏడుకొండలు, వెంకటేశ్వర్లు,పత్తిపాటి నాగరాజు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు