ఈఎస్ఐ ఆసుపత్రి నిర్లక్ష్య లోపం వ్యక్తి మృతి

29-11-2026 | 10:12pm

బెడ్ లు కాలి లేవని గాంధీకి పంపిన వైనం

సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందిన వ్యక్తి.

మనోహరాబాద్ నవంబర్ 29, (విజయక్రాంతి): కార్మికులకు(Workers') అండగా ఉండే ఈఎస్ఐ ఆసుపత్రి(ESI Hospital) డాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో ఓ కార్మికుడి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఊపిరితిత్తుల సమస్యతో(Lung problem) ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తికి కాలయాపన చేసి చివరకు బెడ్ లు కాలిలేవు అంటూ నిర్లక్ష్యంగా వహించరూ అని మృతి చెందిన కుటుంబికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మెదక్(Medak) మనోహరబాద్ మండల(Manoharabad Mandal) దండుపల్లి గ్రామానికి చెందిన బండారి శ్రీను దండుపల్లిలో ఓ ప్రయివేటు పరిశ్రమలో కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు.

అనుకోకుండా ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఆయనను శనివారం నాడు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడకి వెళ్ళిన ఎంత సేపటికీ సిబ్బంది ఎవరు పట్టించుకోలేదు. అని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు బెడ్ లు కాలిలేవు గాంధీకి వెళ్లాలని అనడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు, దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అప్పటికే పరిస్థితి విష మించడంతో గాంధీ ఆసుపత్రిలో ఆదివారం నాడు మరణించాడు.

ఈ ఘటనపై వారు మాట్లాడుతూ కార్మికులకు తోడుగా ఉండే ఈఎస్ఐ  అండగా ఉంటుందని అనుకుంటే ఇంత నిర్లక్షం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెల ఈఎస్ఐ కి డబ్బులు కడుతున్న కార్మికులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు ఇవ్వకుండా నిర్లక్షం చేస్తుందని ఆరోపించారు. మృతుడీ బార్య రేణుక సైతం గుండె వ్యాధి ఉండడంతో ఇప్పుడూ ఆ కుటుంబాన్ని అందుకునేవారు లేరని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు