ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన వెంకటరెడ్డి
29-11-2026 | 09:45pm
కూసుమంచి, నవంబర్ 29 విజయక్రాంతి: పాలేరు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) సహకారంతో నాయకన్ గూడెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma houses) శంకుస్థాపన కార్యక్రమంలో కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచరి సైదమ్మ, ఉపసర్పంచ్ భీష్మాచారి, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.