లైట్లు లేని ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్, ఓమ్ని

29-11-2026 | 09:52pm

.. మహిళకు తీవ్ర గాయాలు! 

మిడ్జిల్, నవంబర్ 29: జడ్చర్ల–కల్వకుర్తి జాతీయ రహదారి(Jadcherla–Kalwakurthy National Highway) 167పై మిడ్జిల్ మండలం(Midjil Mandal) లింభ్య తాండా గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ఒకేసారి రెండు రోడ్డు ప్రమాదాలు(Road Accidents) చోటుచేసుకున్నాయి. రోడ్డుపై లైట్లు లేకుండా నిలిపి ఉంచిన ట్రాక్టర్ ఈ ప్రమాదాలకు కారణమైంది. మొదట వెనుక నుంచి వచ్చిన బైక్ ట్రాక్టర్‌ను ఢీకొనగా, అదే సమయంలో ట్రాక్టర్ ట్రాలీని గుర్తించని ఓమ్ని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఓమ్ని వాహనంలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాత్రి వేళల్లో రహదారులపై లైట్లు లేకుండా ట్రాక్టర్లను నిలిపి ఉంచడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు