ఘనంగా కుమ్మరి సంఘం వారి వనభోజన మహోత్సవం

29-11-2026 | 09:42pm

ఖమ్మం: శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ(Sri Sri Sri Daksha Prajapati Shalivahana Society) మరియు శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్(Shalivahana Welfare Trust) ఆధ్వర్యంలో మలీదు జగన్ గారి మామిడి తోటలో జరిగిన కుమ్మర్ల వనభోజన కార్యక్రమాలు ఎంతో ఆహ్లాదంగా సాగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) గారు మాట్లాడుతూ.. కుమ్మరి సామాజిక వర్గంతో(Kummaris community) తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలియజేస్తూ ఖమ్మం నగరంలో వారికి కావలసినటువంటి సంఘం భవనం నిర్మాణానికి మరియు చేసిన కుండలు అమ్ముకోవడానికి మార్కెట్ కోసం స్థలం అలాగే పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మినీ ఫంక్షన్ లాంటివి మంజూరు  చేస్తామని హామీ ఇచ్చారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కానుగుల రాధాకృష్ణ  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ శ్రీ దక్షిణపతి శాలివాహన వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ రకాల సేవా కార్యక్రమాలను ప్లెక్సీల రూపంలో ప్రదర్శించగా.. మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో దక్ష ప్రజాపతి అధ్యక్షుడు తెగుళ్ళ వెంకటరమణ, మొగిలిచర్ల వెంకటేశ్వర్లు ఎలా సాగరపు ప్రసాద్ దరిపల్లి భాస్కర్ చేతరాజు పల్లి చందు కొత్తపల్లి సర్వే కొలిచెర్ల చిరంజీవి రాచర్ల రాజు కానుగుల వేణు చలిగంటి బిక్షమయ్య శనగరపు సత్యనారాయణ, చాతరాజుపల్లి చందు,  మొగిలిచర్ల భద్రయ్య దునుకు వేలాద్రి మరియు కుల బంధువులు మహిళా సోదరిమణులు చిన్న పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు