వైభవంగా భీమలింగేశ్వరస్వామి గోపుర కలశ ప్రతిష్ఠ
కలశ,మరకత లింగ, కాలభైరవ ప్రతిష్ఠ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి చేతుల మీదుగా గోపురం ప్రారంభం
హుజూర్ నగర్,నవంబర్ 29 : పట్టణంలోని శ్రీ పార్వతీ భీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో(Sri Parvati Bhimalingeswara Swamy Temple) మూడు రోజుల పాటు జరిగిన దేవాలయ రాజ గోపుర కలశ, సాలహార, కాలభైరవ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.వేలాది మంది భక్తుల(devotees) జయజయధ్వానాల మధ్య, వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. గణపతి పూజ, మంటపారాధనలు, రుద్ర హోమం, దేవతా హవనములతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
అనంతరం యంత్ర ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ, మరకత లింగ ప్రతిష్ఠ, కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించబడ్డాయి. కాలభైరవ అష్టోత్తర శతనామార్చన, పూర్ణాహుతి, కుంభాభిషేకం, నీరాజన మంత్రపుష్ప ప్రసాద వినియోగములతో ప్రతిష్ఠా మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన కోదాడ శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి(Kodad MLA Nalamada Uttam Padmavathi Reddy) గోపురం ప్రారంభోత్సవం నిర్వహించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...హుజూర్నగర్ లో అత్యంత వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం జరగడం సంతోషంగా ఉందని,ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వేలాది మంది భక్తులు(devotees) అన్నప్రసాదం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఈఓ గుజ్జుల కొండారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ రావు, కౌన్సిలర్లు వల్లెపునాగరాజు,నల్గొండ సుజాత చంటి,చిట్టిపోతుల భద్రమ్మ, రమేష్,సైదులు,మురళి,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గజ్జి ప్రభాకర్, కీతా మల్లికార్జున్ రావు, శ్రీనివాసరెడ్డి,రమేష్,రామ్మోహన్రావు, చిట్యాల అమర్నాథరెడ్డి,గుండా శ్రీనివాసరావు,జూలకంటి ఉపేందర్, ఏలూరు రాంబాబు,పేరూరి అశోక్, పాల్గొన్నారు.