శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక భజనలు

15-11-2026 | 05:06pm

తాడ్వాయి,నవంబర్,15( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో(Sri Sabarimata Ashram) భజన మండలి భక్తులు(Devotees) ప్రతి రెండవ శనివారం ప్రత్యేక భజన కీర్తనలు నిర్వహిస్తారు. మండలంలోని ఏండ్రియాల్,తాడువాయి, దేవాయిపల్లి,చిట్యాల గ్రామాల భక్తులే(Devotees) కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, బీదర్, నిర్మల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అమ్మ భక్తులు(Devotees) తరలివచ్చి భజన కీర్తనలలో పాల్గొంటారు. రాత్రి భజన కీర్తన నిర్వహిస్తూ అమ్మ ధ్యాసలో నిమగ్నమై ఉంటారు.ఈ సందర్భంగా భక్తులు(Devotees) ప్రత్యేకంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆశ్రమ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు