ములుగు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
సిపిఐ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు డిమాండ్..
వెంకటాపురం, నూగూరు నవంబర్ 15 (విజయక్రాంతి): ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా పడక వేసిన పంటలు ఎండిపోవటం జరిగింది. అట్టి పంటలకి వరికి ఎకరకి 30 వేల రూపాయలు పత్తి మిర్చి తదితర వాణిజ్య పంటలకు ఎకరా కు 50 వేల రూపాయలు పంటలు వేయకుండా బీళ్లుగా వున్న మారిన భూముల రైతులకు 10,000 రూపాయలు ఇవ్వాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్(CPI Demands) చేస్తున్నది.
కూలీలకు పనులు దొరక్క నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి కొనుక్కో లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించి ముందుకు సాగాలంటే ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం చేసే రైతులను వ్యవసాయ కార్మికులను జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ఆదుకోవలిచిన అవసరం ఉందని, సిపిఐ పార్టీ ములుగు జిల్లా సమితి రిమాండ్ చేస్తున్నది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు బట్టి సంతోష్, వాజేడు మండల సిపిఐ కార్యదర్శి ఎన్ రవీందర్, దెబ్బగట్ల జనార్ధన్ యువ నాయకుడు గోపి, పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.