సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

12-11-2026 | 04:18pm

తాడ్వాయి,నవంబర్,12( విజయ క్రాంతి ): 36వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు 14 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న తెలిపారు. వికారాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర పోటీలలో క్రీడాకారులు  పాల్గొననున్నారని ఆయన వివరించారు.

ఎంపికైన వారిలో అర్జున్, డోలాజి,వాహెద్,చరణ్, భువనతేజ,విష్ణుకుమార్, శైలేష్,నితిన్, ఆనంద్, దేవి సింగ్, అరవింద్, జస్వంత్, వినయ్,సాయి తేజ లు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి నగేష్,కార్యదర్శి జగదీశ్వర్, ఈసీ మెంబర్ నర్సింలు,శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు