గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి

19-11-2026 | 05:14pm

తాడ్వాయి,నవంబర్,19( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో(Tadvai Mandal Headquarters) తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావును గురువారం కలిసి విజ్ఞప్తి చేశారు.చిట్యాల రోడ్డు నుంచి గ్రామంలోని ట్యాంక్ వరకు ఉన్న పైప్ లైన్ లీకేజీలు అయి చెడిపోయిందని వెంటనే పైప్ లైన్ మార్చాలని వారు కోరారు.

పైపులైన్ నిర్మించడం కోసం నిధులు మంజూరు చేసి తాడ్వాయి గ్రామంలో నెలకొన్న తాగు నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని వారు కోరారు.ఈ విషయమై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందిస్తూ వెంటనే నిధులు మంజూరు చేయించి పైప్ లైన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, ఉప సర్పంచ్ రనిల్ రెడ్డి, నాయకులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు