మండలం అంటే బోర్డులు కాదు

15-11-2026 | 05:34pm

అన్ని కార్యాలయాల భవనాలు నిర్మించండి. 

టిఆర్పి నాయకుల డిమాండ్ 

జుక్కల్, నవంబర్ 15 (విజయక్రాంతి) : జుక్కల్ నియోజకవర్గంలో(Jukkal Constituency) కొత్తగా ఏర్పాటు అయిన డోంగ్లి మండలం(Dongli Mandal) ఏర్పాటై మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మండలానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావు వాగ్మారే  అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మండల ప్రజా పరిషత్ కార్యాలయం(Mandal Praja Parishad Office), సొసైటీ భవనంలో, రెవెన్యూ కార్యాలయం(Revenue Office), రైతు వేదికలో  కొనసాగిస్తున్నరని మండిపడ్డారు. 

మండల విద్యాశాఖ (ఎంఈవో) కార్యాలయం లేదు, పోలీస్ స్టేషన్ లేదు అని తెలిపారు. మండలానికి సంబంధించి ఏ ప్రభుత్వ కార్యాలయాలకు సరైన భవనాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే మండలం... పాలనకు మాత్రం శాశ్వత భవనాలు కరువయ్యాయని విమర్శించారు. మండలం ఏర్పాటు చేయడం అంటే కేవలం బోర్డులు కాదు, పూర్తిస్థాయి పరిపాలన కావాలని డిమాండ్ చేశారు. డోంగ్లి మండల ప్రజల హక్కుల కోసం, అభివృద్ధి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు