ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన సుడా చైర్మన్

15-11-2026 | 05:43pm

ముకరంపుర, నవంబర్ 15(విజయక్రాంతి): కరీంనగర్ హుస్సైనిపురలోని సుఫా కన్వెంట్ హైస్కూల్(Sufa Convent High School) లో సన్ రైజ్ హాస్పిటల్(Sunrise Hospital) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును(Free Medical Camp) ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ తో కలిసి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుఫా కాన్వెంట్ హైస్కూల్ కరస్పాండెంట్ అబూజర్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా ఎంతో మందికి వైద్య సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అబూజర్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న దాదాపు 500 మందికి పైగా పేషంట్లకు ఉచితంగా వైద్యం మరియు మందులు అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇక్రమ్,నవ్విద్,జమీల్, షబానా మహమ్మద్, ఖలీల్,షాహిద్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు