గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
ఆసిఫాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు(Dharmapuri Venkateshwarlu) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కవులు దేవరాజు రేవతి, గుర్రాల వెంకటేశ్వర్లు, నల్లగొండ రమేష్, చిలుకూరి రాధాకృష్ణ చారి, రాజన్న తమ కవితలు వినిపించి అలరించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్లు ప్రవీణ్, సదానందం, పృథ్వీరాజ్, శారద తదితరులు పాల్గొన్నారు.