నంది విగ్రహం పెక్కిలించకపోవడం చాలా బాధాకరం
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి...
కొల్లాపూర్ నవంబర్ 15: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని కుడికిల్లలో నందీశ్వరుని విగ్రహాన్ని చోరీ చేసిన 15 రోజులైనా ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని వారు ఆరోపించారు. ఆదివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి(Ex MLA Harsha Vardhan Reddy) ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం అభివృద్ధి చెందుతున్న సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నంది విగ్రహ చోరీ దారుణం.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కావచ్చు కొల్లాపూర్ ప్రాంతంలో ఈ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఎవరైతే వారి వ్యక్తిగత స్వార్థం కోసం వారి స్వలాభం కోసం హిందూ ధర్మాన్ని ద్వంసం చేసే కార్యక్రమం తీవ్రంగా కలచివేస్తా ఉంది. 15 రోజులు అవుతున్న ఇంతవరకు నిందితులను ఐడెంటిఫై చేయకపోవడం దోషులను అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం.
బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నమన్నారు. కుడికిల్ల గ్రామంలో జరిగిన విగ్రహ అపహరణ గురించి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి స్థానిక ఎస్సై సిఐ తో పాటు జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి చాలా లోతుగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటే ఇలాంటి ఘటనలు ఎక్కడ పురాతనం కాకుండా ఉంటాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శివయ్య. టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ రావు. తదితరులు పాల్గొన్నారు.