లక్కీ డ్రా ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

15-11-2026 | 05:48pm

మహబూబాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు పట్టణంలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను(Double Bedroom Homes) జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(Collector Sneha Shabari) ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ఎల్ 2, ద్వారా అర్హులైన 280 మంది లబ్ధిదారులను(beneficiaries) పూర్తిగా పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయించారు. రెండు పడకల గదుల ఇండ్లను స్వయంగా పరిశీలించి లబ్ధిదారులకు(beneficiaries) అందించడం కోసం అన్ని సౌకర్యాలను ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses), రెండు పడక గదుల నిర్మాణం అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్  స్థానిక సంస్థలు హౌసింగ్ పీ డీ పురుషోత్తం, మున్సిపల్ చైర్పర్సన్ తూణం శ్రావణ్, వైస్ చైర్పర్సన్ సోమ రజిని, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు