బీజేవైఎం మండల అధ్యక్షుడుగా హన్మగల్ల బాల్ రాజ్
రాజాపూర్ నవంబర్ 9 : ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) ద్వారా విద్యార్థి ఉద్యమంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన హన్మగల్ల బాల్(Hanmagalla Balraj) రాజ్, 2016 నుంచి విద్యార్థి, యువజన రంగాల్లో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న అతనిని బీజేవైఎం మండల అధ్యక్షుడిగా(BJYM Mandal President) ఎన్నుకోబడినట్లు తెలిపారు.
బాలానగర్ ఉమ్మడి మండలం,రాజాపూర్ మండలంలో దాదాపు 9 సంవత్సరాల పాటు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. రెండు సంవత్సరాల పాటు పాలమూరు జిల్లా హాస్టల్ కన్వీనర్‌గా పనిచేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. దాదాపు పదేళ్లకు పైగా విద్యార్థులకు అండగా ఉంటూ, వారి సంక్షేమం కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు.
ఈ ప్రయాణంలో ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, సవాళ్లు, అరెస్టులను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా తన బాధ్యతలను కొనసాగించినట్లు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి బీజేవైఎం మండల అధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.