అరుణా దేవి సేవలు అభినందనీయం
యాదగిరి సునీల్ రావు
ముకరంపుర, నవంబర్ 7(విజయక్రాంతి) : కరీంనగర్ భగత్ నగర్(Bhagat Nagar, Karimnagar) కు చెందిన అరుణాదేవి సాంఘిక సంక్షేమ శాఖ(Arunadevi, Social Welfare Department)లో గురుకుల హాస్టల్ వార్డెన్ గా 38 సంవత్సరాల సుదీర్ఘమైన, నిస్వార్ధమైన సేవలు అందించడం అభినందనీయమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.
నగరంలో నిర్వహించిన అరుణాదేవి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణా దేవి- నరసింహస్వామి దంపతులను ఘనంగా సన్మానించి మాట్లాడుతూ అరుణా దేవి 38 సంవత్సరాలు గురుకుల హాస్టల్ వార్డెన్ గా ఎంతోమంది విద్యార్థుల బాగోగులను చూసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇందులో భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తోకల భూమేశ్వర్, వడ్డే శ్రీరామ్ రెడ్డి, చీకోటి గాంధీ, వెంకటేశ్వరరావు, ఎనగందుల వెంకన్న, తదితరులు ఉన్నారు.