యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

07-11-2026 | 11:06pm

దేవరకొండ, నవంబర్ 7 (విజయక్రాంతి) : మేరా యువ భారత్ నల్లగొండ(Mera Yuva Bharat Nalgonda) ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల(Government Junior College for Girls) దేవరకొండలో మాదకద్రవ్యాల నిర్మూలనపై  శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవి, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌వీటీలు మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులతో డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మై భారత్ కోఆర్డినేటర్ రామావత్ సతీష్, కొండా నాయక్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు