పాఠశాలకు వెళ్లే రోడ్డుపై మురుగునీరు.. విద్యార్థుల అవస్థలు!

07-11-2026 | 11:08pm

కోనరావుపేట నవంబర్ 7 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం(Konaraopeta Mandal) కనగర్తి గ్రామంలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు వెళ్లే రోడ్డుపై మురుగునీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు