కిడ్నీ రోగులకు కొండంత అండ.. డయాలసిస్‌లో 19 వేల మైలురాయి!

07-11-2026 | 11:00pm

ఆసిఫాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): కిడ్నీ వ్యాధిగ్రస్తులకు(Kidney disease patients) స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రం(Government General Hospital Dialysis Center) విశేష ప్రగతి సాధిస్తోంది. ఇప్పటివరకు ఏకంగా 19,131 డయాలసిస్ చికిత్సలు పూర్తి చేసుకుంది. 10 బెడ్ల సామర్థ్యంతో మూడు షిఫ్టుల్లో రోజుకు సుమారు 30 మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తోంది.

2023 జూన్ 14న ప్రారంభమైన ఈ కేంద్రం మారుమూల ప్రాంతాల కిడ్నీ రోగులకు ఎంతో ఊరటనిస్తోందని జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ కిరణ్ తెలిపారు. గతంలో డయాలసిస్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగానే చికిత్స అందడంతో ప్రయాణ ఖర్చులు, శ్రమ తగ్గాయని పేర్కొన్నారు. కొత్త రోగుల కోసం స్లాట్లు అందుబాటులో ఉన్నాయని డయాలసిస్ యూనిట్ ఇన్‌చార్జి తిరుపతి తెలిపారు. అవసరమైన వారు ఆసుపత్రిని సంప్రదించి నమోదు చేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు