రైతు గర్జన సభను విజయవంత చేయండి

07-11-2026 | 11:16pm

ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్ (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన జరుప తలపెట్టిన రైతు గర్జన సభను విజయవంతం చేయాలని, అందుకోసం రైతులు గ్రామాల నుంచి తరలిరావాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం ఖానాపూర్లో ఆయన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అందరితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నందున రైతులు పెద్ద ఎత్తున పాల్గొని రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు