ఏఎస్‌డీడీ జాబితా ఓటర్లకు మరో అవకాశం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఏఎస్‌డీడీ జాబితా(ASDD voters)లో ఉన్న ఓటర్లకు తమ వివరాలు సమర్పించేందుకు మరో అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి(Telangana Chief Electoral Officer Sudarshan Reddy) తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కె.హరిత, ఆర్డీఓ లోకేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గైర్హాజరు, వలస, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల జాబితాలో ఉన్నవారి వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి, అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.