కామారెడ్డి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షునిగా దినేష్ రెడ్డి

07-11-2026 | 11:05pm

కామారెడ్డి, నవంబర్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్(Kamareddy District Handball Association) అధ్యక్షునిగా వడ్డేపల్లి దినేష్ రెడ్డిని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివ నగర్ మండలం బొంపల్లి వద్దగల జిపి గార్డెన్స్ లో నిర్వహించిన అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్యామల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.

రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్రెడ్డి రామిరెడ్డి సూచనల మేరకు ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి మండల నాయకులు బిక్కనూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పోసానిపల్లి చిరంజీవిలు, అడవి లింగాల నిజాం, దేవునిపల్లి పరంధాములు, నీల రవి లు పాల్గొన్నారు. దినేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న హ్యాండ్ బాల్ క్రీడాకారులు కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో హ్యాండ్ బాల్ క్రీడ ను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు