కరువు మండలాల రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి

07-11-2026 | 11:01pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తక్కువ వర్షపాతం నమోదైన కరువు మండలాల్లో రైతులకు బ్యాంకులు అందించిన పంట రుణాలను రీషెడ్యూల్(Reschedule Farmer Loans) చేయాలని కలెక్టర్ కె.హరిత(Collector Haritha) సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎల్‌డీఎం జనార్దన్(LDM Janardhan), జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్‌తో కలిసి కరువు సహాయ చర్యలపై జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు రుణాల రీషెడ్యూల్ ప్రక్రియలో న్యాయం జరిగేలా చూడాలని, పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలను కూడా పునర్వ్యవస్థీకరించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు